ఆర్థిక నిబంధనలు సరళీకృతం

పెట్టుబడులకు సంబంధించి ఆర్థిక వ్యవహారాల విభాగం నిబంధనలను సరళీకృతం చేయాలని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీకి రాష్ట్ర పట్టణాభివృద్ధి, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు విజ్ఞప్తిచేశారు. బుధవారమిక్కడ పలువురు తెరాస ఎంపీలతో కలిసి కేంద్రమంత్రితో కేటీఆర్‌ భేటీ అయ్యారు. పసుపుబోర్డు, నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌ అంశాలపై కేంద్ర వాణిజ్యమంత్రి సురేశ్‌ప్రభుతో చర్చించారు. పారిశ్రామిక రంగంలో రావాల్సిన విధానపరమైన మార్పులపై నీతిఆయోగ్‌ అధికారులతో మాట్లాడారు. బీడబ్ల్యూ బిజినెస్‌ వరల్డ్‌ ఐదవ స్మార్ట్‌సిటీస్‌ కాన్‌క్లేవ్‌ అవార్డుల కార్యక్రమంలో ‘అర్బన్‌ లీడర్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ అవార్డును కేటీఆర్‌ అందుకొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘దేశంలో ఎదుగుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. ఇతర దేశాల నుంచి అనేక మంది రాష్ట్రంలో పెట్టుబడులు పెడతామని ముందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్థికవ్యవహారాల నిబంధనలను సరళీకృతం చేయాలని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీకి వివరించాం.…

Read More