నేను చెప్పిందే నిజమైంది: రేవంత్ రెడ్డి

నేను చెప్పిందే నిజమైంది: రేవంత్ రెడ్డి

కొడంగల్ నియోజకవర్గంలో తనను ఓడించేందుకు తెలంగాణ రాష్ట్ర సమితి రూ. 100 కోట్లు ఖర్చు చేసేందుకు ప్రణాళికలను సిద్ధం చేసుకుందని తాను తొలి నుంచి చెబుతూనే ఉన్నానని, ప్రస్తుత తనిఖీల్లో అది నిజమైందని తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. తనకు తెలిసిన సమాచారం ప్రకారం, కొడంగల్ టీఆర్ఎస్ నేతల ఇంట రూ. 15 కోట్ల నగదు, రూ. 25 కోట్ల నగదు పంపిణీ స్లిప్పులు లభించాయని ఆయన అన్నారు. తనను ఓడించడం సాధ్యం కాదని తెలిసి కూడా కేసీఆర్ మొండిగా వెళుతున్నారని ఆరోపించిన ఆయన, డబ్బు దొరికిన కేసును నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు.

Read More