రీపోలింగ్ ఎఫెక్ట్: ఓట్లు వందల్లోనే అయినా… సర్వశక్తులూ ఒడ్డేందుకు టీడీపీ, వైసీపీ సిద్ధం!

రీపోలింగ్ ఎఫెక్ట్: ఓట్లు వందల్లోనే అయినా... సర్వశక్తులూ ఒడ్డేందుకు టీడీపీ, వైసీపీ సిద్ధం!

ఏపీలో మరోసారి ఎన్నికల వాతావరణం ఏర్పడింది. ఈ నెల 6వ తేదీన ఐదు పోలింగ్ బూత్ లలో రీపోలింగ్ కు ఈసీ నిర్ణయించిన నేపథ్యంలో, ఇక్కడున్న ఓటర్లకు ఎనలేని డిమాండ్ ఏర్పడింది. ఈ ఎన్నికల్లో ప్రధాన పార్టీల మధ్య పోటీ తీవ్రంగా ఉంటుందని, మెజారిటీ స్వల్పంగానే ఉండవచ్చని భావిస్తున్న నేపథ్యంలో, ఈ పోలింగ్ బూత్ లలో సాధ్యమైనన్ని ఎక్కువ ఓట్లను సంపాదించుకోవాలని అటు తెలుగుదేశం, ఇటు వైసీపీలు వ్యూహాలను రచిస్తున్నాయి. నరసరావుపేట పరిధిలోని కేసనపల్లి – 94వ నెంబర్ పోలింగ్‌ బూత్, గుంటూరు వెస్ట్ పరిధిలోని నల్లచెరువు – 244వ పోలింగ్‌ బూత్, కోవూరు పరిధిలోని పల్లెపాలెం, ఇసుకపల్లి – 41వ పోలింగ్‌ బూత్, సూళ్లూరుపేట పరిధిలోని అటకానితిప్ప-197వ పోలింగ్‌ బూత్, ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం పరిధిలోని కలనూతల – 247వ పోలింగ్‌ బూత్‌ లో రీపోలింగ్…

Read More