మీకు గోదావరి నది గురించి క్లాస్ పీకుతా… ఉండండి!: ఏపీ సీఎం జగన్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏపీ ప్రజల విషయంలో ఉదారంగా వ్యవహరిస్తున్నారని ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రశంసించారు. ఆయనతో ఉన్న సత్సంబంధాల కారణంగానే గోదావరి నీళ్లను శ్రీశైలం, నాగార్జున సాగర్ కు తీసుకెళ్లాలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని వ్యాఖ్యానించారు. ‘ఇలాంటి పరిస్థితుల్లో, కేసీఆర్ తో ఉన్న సత్సంబంధాల దృష్ట్యా హర్షించాల్సిందిపోయి ఏం మాట్లాడుతున్నారు? గోదావరి నీటిని మనం పోలవరం దిగువ నుంచి తీసుకోవడం లేదు. కేసీఆర్ ఈ నీళ్లను తన రాష్ట్రం నుంచి తీసుకెళ్లేందుకు అనుమతిస్తున్నారు. కేసీఆర్ ఉదారతకు(మగ్నానిమిటీకి) సంతోషించాల్సింది పోయి మనం చేస్తున్నది ఏంటి అధ్యక్షా. గోదావరి గురించి మీకు క్లాస్ పీకుతా ఉండండి. గోదావరికి నాలుగు పాయలు. ఒకటి నాసిక్ నుంచి వస్తుంది. ఇది ఎప్పుడో ఎండిపోయింది. రెండో పాయ ప్రాణహిత పాయ. దీని నుంచి 36 శాతం గోదావరికి నీళ్లు వస్తాయి. మూడోది ఇంద్రావతి పాయ.…

Read More