ప్రజా సేవల హామీ చట్టం

గడువు మీరితే దరఖాస్తుదారుడికి పరిహారం చెల్లించాలి
సంబంధిత అధికారి నుంచే వసూలు
సభలో బిల్లు
ప్రభుత్వం, ప్రభుత్వ ప్రాధికార సంస్థల నుంచి పౌరులు తమకు కావాల్సిన సేవలకు దన్నుగా నిలిచే ‘ఏపీ ప్రజా సేవల సమకూర్చు హామీ చట్టం-2017’ను శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ చట్టం ద్వారా ప్రజలకు సేవలు అందించడంలో ప్రభుత్వ అధికారుల్లో జవాబుదారీతనం పెంచేలా దీన్ని రూపొందించారు. పరిశ్రమలశాఖ మంత్రి అమరనాథరెడ్డి బిల్లును ప్రవేశపెట్టారు.
* ప్రతి వ్యక్తి నిర్ణీత సమయంలోపు సేవలను పొందే హక్కు కలిగి ఉంటారు.
* ప్రభుత్వ, ప్రభుత్వ ప్రాధికార సంస్థలు పౌరులు ఆన్‌లైన్‌లో అడిగిన సేవలను ఎంత కాలంలో అందిస్తారో కాల
పరిమితి స్పష్టంగా తెలియజేయాలి.
* సమస్య పరిష్కారం ఎందుకు ఆలస్యమవుతుందో అధికారులు ముందుగానే దరఖాస్తుదారుకు రాతపూర్వకంగా
తెలియజేయాలి.
పారిశ్రామిక కారిడార్‌ చట్టం: రాష్ట్రంలో పారిశ్రామిక కారిడార్లు అభివృద్ధి చేస్తున్న సందర్భంలో ప్రభుత్వం ఈ కారిడార్లకు ప్రోత్సాహం ఇచ్చేలా ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక కారిడార్‌ అభివృద్ధి చట్టం-2017ను శాసనసభలో ప్రవేశపెట్టింది. రాష్ట్రంలో విశాఖపట్నం-చెన్నై పారిశ్రామిక కారిడార్‌, చెన్నై-బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌లను అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి కారిడార్ల అభివృద్ధికి ఊతమిచ్చేలా ఈ చట్టంలో ఏపీ పారిశ్రామిక కారిడార్‌ అభివృద్ధి ప్రాధికార సంస్థ ఏర్పాటు చేస్తారు.
దీనికి ముఖ్యమంత్రి అధ్యక్షులుగా ఉంటారు. పరిశ్రమలకు భూముల సేకరణ, నోడ్‌ల అభివృద్ధి తదితర అంశాలన్నీ ఈ సంస్థ పరిధిలోకి వస్తాయి. ఎక్కడెక్కడ పారిశ్రామిక కారిడార్లు, నోడ్‌లు అభివృద్ధి చేయాలి అనేదానిపై ప్రణాళికలు రూపొందించడం, బృహత్‌ప్రణాళిక రూపకల్పన మౌలిక వసతుల కల్పన లాంటి పనులను ఈ సంస్థ పర్యవేక్షిస్తుంది.

Related posts

Leave a Comment