వరుణ్‌తేజ్‌తో ఓ సినిమా చేయాలి!

‘‘దేశాన్నీ, ఇంటినీ కాపాడే బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించిన ‘జె’ౖ అనే కుర్రాడి కథ ఇది. ఆసక్తికరమైన కథ, కథనాలతో దర్శకుడు రవి ఈ సినిమాని నడిపించాడు. నా లుక్‌, బాడీ లాంగ్వేజ్‌, హెయిర్‌ స్టయిల్‌, సంభాషణలు పలికే విధానం మొత్తం మారిపోయాయి. ప్రతి సినిమాలోనూ అమ్మాయిల వెంట పడే పోకిరిగానే కనిపించాను. ఇందులో మాత్రం… నా వెనుకే హీరోయిన్‌ పడుతుంటుంది’’

* అపజయం వెంటే విజయం
‘‘ప్రతి సినిమానీ ప్రత్యేక అంచనాలతో చేయను. మంచి సినిమా ఇవ్వడంపైనే నా ధ్యాసంతా. ఒకోసారి అపజయాలు వస్తాయి. వాటి వెన్నంటే విజయాలూ వస్తాయని మాత్రం నమ్ముతా. నా సినిమాలు బాగా ఆడినంత మాత్రాన స్టార్‌డమ్‌ వచ్చేసిందనుకోను. విజయం అనేది కొన్ని సినిమాలకే పరిమితం కాదు. అదో నిరంతర ప్రక్రియ. కృష్ణవంశీతో చేసిన ‘నక్షత్రం’ ఆడలేదు. కానీ ఆ పాత్ర ద్వారా చాలా నేర్చుకున్నా’’
* మూడుంటే చాలు
‘‘ప్రస్తుతం వీవీ వినాయక్‌ దర్శకత్వంలో చేస్తోన్న చిత్రంపై చాలా అంచనాలున్నాయి. దానికి తగ్గట్టే సినిమా కూడా కొత్త కోణంలో ఉంటుంది. కరుణాకరన్‌ దర్శకత్వంలో ఓ ప్రేమకథా చిత్రం చేస్తున్నాను. అనుపమ పరమేశ్వరన్‌ నాయిక. కె.ఎస్‌. రామారావు నిర్మాత. గీతా ఆర్ట్స్‌లో ఓ సినిమా ఉంటుంది. మైత్రి మూవీస్‌లోనూ ఓ సినిమా చేస్తున్నా. ఏడాదికి నా నుంచి మూడు మంచి సినిమాలొస్తే చాలు’’
* అవన్నీ వదంతులే..
‘‘మహేష్‌బాబుతో ఓ సినిమా చేస్తున్నానని వార్తలొచ్చాయి. ఎస్‌.ఎస్‌. రాజమౌళి, రామ్‌చరణü, ఎన్టీఆర్‌ సినిమాలోనూ నటిస్తున్నట్టుగా చెప్పుకుంటున్నారు. అవేం నిజాలు కావు. నేను, వరుణ్‌తేజ్‌ కలిసి ఓ సినిమా చేద్దామనుకుంటున్నాం. మంచి కథ దొరగ్గానే పట్టాలెక్కుతుంది.
మల్టీస్టారర్‌ కథలొస్తే తప్పకుండా చేస్తా’’

Related posts

Leave a Comment