‘రంగస్థలం’లో చిట్టిబాబుగా చరణ్.. ఫస్ట్ లుక్ విడుదల!

ఫస్ట్ లుక్ విడుదల చేసిన రామ్ చరణ్
ఈ చిత్రంలో చిట్టిబాబు పాత్ర పోషిస్తున్న మెగా పవర్ స్టార్
2018 మార్చి 30న విడుదల కానున్న ‘రంగస్థలం’
సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న ‘రంగస్థలం’ చిత్రం ఫస్ట్ లుక్ కొంచెం సేపటి క్రితం విడుదలైంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ‘‘రంగస్థలం’లోని ‘చిట్టిబాబు’ను 2018 మార్చి 30న కలవండి!’ అని చెర్రీ తన పోస్ట్ లో పేర్కొన్నాడు. ఈ పోస్ట్ ద్వారా ‘రంగస్థలంలో’ చిట్టిబాబు పాత్రను చరణ్ పోషిస్తున్నట్టు స్పష్టమైంది. కాగా, ఈ చిత్రం లో రామ్ చరణ్ సరసన సమంత నటిస్తోంది.

Related posts

Leave a Comment