ఓ ఈవీఎంను జీపులో మరిచిపోయారు..!

గుజరాత్‌లో ఘటనపై ఈసీకి నివేదిక
అది అదనపు యంత్రమేనన్న అధికారులు
అహ్మదాబాద్‌: గుజరాత్‌లోని నర్మదా జిల్లాలో ప్రభుత్వాధికారులు ఓ ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాన్ని ప్రైవేటు జీపులోనే వదిలేసి వెనక్కి వచ్చేశారు. దెదియాపాడా నియోజకవర్గంలో శనివారం చోటు చేసుకున్న ఈ ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. జీపు డ్రైవరు, కొంతమంది స్థానిక నేతలు ఈ ఈవీఎంను గమనించి జిల్లా కేంద్రానికి చేర్చారు. దీనిని అదనంగా అందుబాటులో ఉంచామనీ, పోలింగ్‌లో వాడలేదనీ నర్మదా కలెక్టర్‌ ఆర్‌.ఎస్‌.నినామా స్పష్టంచేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులకు తాఖీదు జారీచేయనున్నామని చెప్పారు.
ఓటింగ్‌ 66.75 శాతమే
గుజరాత్‌ తొలిదశ ఎన్నికల్లో 68% ఓట్లు పోలయ్యాయని శనివారం తొలుత ప్రకటించినా పూర్తిస్థాయి క్రోడీకరణ తర్వాత ఇది 66.75 శాతంగానే ఉందని ఈసీ తెలిపింది. 19 జిల్లాల్లోని 89 స్థానాలకు గానూ నర్మదా జిల్లాలో అత్యధికంగా 79.15% ఓట్లు పోలయ్యాయి. ఓట్ల వివరాలు శనివారం రాత్రి పొద్దుపోయాకగానీ అధికారులకు అందలేదు.

Related posts

Leave a Comment