అఖిల్‌ నటుడిగా మరో మెట్టు ఎక్కుతాడు

‘‘తరతరాలుగా అందరి నోళ్లలో నానుతున్న మాట ‘హలో’. ఆ మాటకీ అక్కినేని కుటుంబానికి ఎంతో అనుబంధం ఉంది. అక్కినేని నాగేశ్వరరావు ‘హలో హలో…’ అంటూ పాడారు. నాగార్జున, అమల ‘హలో గురూ…’ అని పాడుకొన్నారు. ‘హలోబ్రదర్‌’ అనే సినిమా కూడా వచ్చింది. ఇప్పుడు అఖిల్‌ కూడా ‘హలో’ అంటూ పలకరిస్తున్నాడు. చరిత్రలో నిలిచిపోయేలా ‘మనం’ చిత్రాన్ని తీసిన విక్రమ్‌, అదే స్థాయిలో ‘హలో’ ప్రేమకథని తెరకెక్కించాడు. అఖిల్‌ ఈ సినిమాతో నటుడిగా మరో మెట్టు ఎక్కుతాడు’’ అన్నారు ప్రముఖ కథానాయకుడు చిరంజీవి. ఆయన బుధవారం రాత్రి హైదరాబాద్‌లో జరిగిన ‘హలో!’ ముందస్తు విడుదల వేడుకకి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అఖిల్‌ అక్కినేని కథానాయకుడిగా నటించిన చిత్రమిది. కల్యాణి కథానాయిక. విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకుడు. అక్కినేని నాగార్జున నిర్మించారు. ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకొస్తోంది. వేదికపై చిరంజీవి మాట్లాడుతూ ‘‘అక్కినేని కుటుంబంతో నాకెంతో అవినాభావ సంబంధం ఉంది. ముందుగా ‘హలో’ టైటిల్‌ ఈ సినిమాకి పెట్టినందుకు హ్యాట్సాఫ్‌ చెప్పాలి.

ఈ సినిమాకి ప్రచారం అవసరం లేదు. ఫోన్‌ ఎవరి చేతుల్లో ఉంటే వాళ్లంతా పలికేది ‘హలో’నే. నేను సినిమా చూశా. విడుదల కాకముందే సినిమాని చూడటం ఓ పరీక్షలాంటిది. బాగుంటుందా, ఉండదా? చూశాక ఏం చెప్పాలి? అనే ప్రశ్నలు వెంటాడుతుంటాయి. కానీ ఈ సినిమా చాలా బాగుంది. ఒక అద్భుతమైన ప్రేమకథ. ఎంతో స్వచ్ఛంగా ఉంటుంది. ఇలాంటి ఓ సినిమా తీసినందుకు విక్రమ్‌కి అభినందనలు చెబుతున్నా. యువతరాన్నే అలరించే అంశాలే కాకుండా, అద్భుతమైన సెంటిమెంట్‌ కూడా ఉంది’’ అన్నారు. విక్రమ్‌ కె.కుమార్‌ మాట్లాడుతూ ‘‘సినిమా అందరికీ నచ్చేలా ఉంటుంది. ఈ అవకాశమిచ్చిన నిర్మాత నాగార్జునకి కృతజ్ఞతలు.

Related posts

Leave a Comment