వేధింపులపై కొత్త అస్త్రం

వేధింపులను నిలువరించేందుకు ఫేస్‌బుక్‌ సరికొత్త అస్త్రంతో ముందుకువచ్చింది. అనవసర ‘‘ఫ్రెండ్‌ రిక్వెస్టులు’’ మన దరిచేరకుండా అడ్డకునేందుకు ఇది తోడ్పడుతుంది. ముఖ్యంగా మహిళలకు ఇది ఎంతగానో ఉపయోగపడే అవకాశముంది. దిల్లీ, అమెరికాకు చెందిన స్వచ్ఛంద సంస్థలతో కలిసి ఫేస్‌బుక్‌ ఈ అస్త్రాన్ని సిద్ధంచేసింది. నకిలీ ఖాతాలను వేగంగా గుర్తించి, తొలగించేందుకు ఈ సదుపాయం తోడ్పడే వీలుందని సంస్థ పేర్కొంది. ‘అక్కర్లేని సందేశాలనూ అడ్డుకునేలా కొత్త సదుపాయాన్ని తీసుకొచ్చాం. ఒకసారి దీన్ని క్రియాశీలంచేస్తే సంబంధిత వ్యక్తి పంపిన సందేశాలపై ఎలాంటి నోటిఫికేషన్లూ రావు. ఆ సందేశాలన్నీ ప్రత్యేక ఫోల్డర్‌లోకి వెళ్లిపోతాయి. కావాలంటే అక్కడ వాటిని పంపిన వ్యక్తికి తెలియకుండా చదివే వీలుంది. త్వరలో గ్రూపుల్లోని సందేశాలకూ ఈ వీలును కల్పించనున్నాం’అని వివరించింది.

Related posts

Leave a Comment