కొత్త చిత్రం మొదలు

రవితేజ కథానాయకుడిగా కల్యాణ్‌కృష్ణ కురసాల దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. మాళవిక శర్మ కథానాయిక. రామ్‌ తాళ్లూరి నిర్మిస్తున్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో చిత్రీకరణ మొదలైంది. రవితేజతో పాటు, ఇతర ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. ‘నేల టికెట్‌’గా ప్రచారంలో ఉన్న ఈ చిత్రం రవితేజ శైలి మాస్‌ అంశాలతోనూ.. కల్యాణ్‌కృష్ణ శైలి కుటుంబ నేపథ్యం మేళవింపుతో తెరకెక్కుతున్నట్టు సమాచారం. ముకేష్‌ కెమెరా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. త్వరలోనే ‘టచ్‌ చేసి చూడు’తో సందడి చేయబోతున్న రవితేజ, విరామం లేకుండా కొత్త చిత్రం కోసం రంగంలోకి దిగడం విశేషం. ఓ ప్రముఖ దర్శకుడితో మరో చిత్రం గురించి కూడా చర్చలు జరుగుతున్నట్టు సమాచారం. చూస్తుంటే రవితేజ మునుపటిలా మళ్లీ జోరు పెంచి సినిమాలు చేయనున్నట్టు అర్థమవుతోంది.

Related posts

Leave a Comment