ముగ్గురు మొనగాళ్లు

‘రంగస్థలం’తో ఓ మధురమైన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు రామ్‌చరణ్‌. ‘భరత్‌ అనే నేను’ అంటూ… మహేష్‌బాబు కూడా మురిపించేస్తున్నాడు. వీరిద్దరితోనూ ఎన్టీఆర్‌కి మంచి అనుబంధం ఉంది. రామ్‌ చరణ్‌తో కలసి ఓ చిత్రంలో నటిస్తున్న ఎన్టీఆర్‌, ‘భరత్‌..’ విడుదల ముందస్తు వేడుకకు అతిథిగా వెళ్లి ‘సినిమా పాత రికార్డులన్నీ తిరగరాయాలి’ అంటూ ఆశీర్వదించి వచ్చాడు. ఇక… ఈ ముగ్గురు హీరోలు కలసి పార్టీ చేసుకోవడానికి మరో కారణం కావాలా?? మంగళవారం రాత్రి ఈ ముగ్గురూ కలిశారు. తాము సాధించిన విజయాలకు గురుతుగా… ఓ వేడుక చేసుకున్నారు. ఇటీవల మహేష్‌, ఎన్టీఆర్‌, చరణ్‌ ముగ్గురూ కలసి పార్టీ చేసుకున్నారు. అప్పటికి ‘భరత్‌..’ ఇంకా విడుదల కాలేదు. ‘భరత్‌..’ సూపర్‌ హిట్టయ్యాక మళ్లీ కలుద్దాం’ అని ఈ ముగ్గురు మిత్రులూ అప్పుడే మాటిచ్చిపుచ్చుకున్నారు. ఇప్పుడు ఇలా విందు చేసుకున్నారు. ఈ ఫొటోని రామ్‌చరణ్‌ శ్రీమతి ఉపాసన ట్విట్టర్‌లో పంచుకున్నారు.

Related posts

Leave a Comment