నటి మమతా కుల్‌కర్ణికి షాక్‌

రూ.20 కోట్ల విలువైన మూడు ఫ్లాట్ల జప్తు
మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కేసులో ఆదేశాలు
బాలీవుడ్‌ అలనాటి అందాల నటి మమతా కుల్‌కర్ణికి మాదక ద్రవ్యాల కేసులను విచారించే ‘ఎన్‌డీపీఎస్‌’ ప్రత్యేక న్యాయస్థానం షాక్‌ ఇచ్చింది. రూ.20 కోట్ల విలువైన ముంబయిలోని ఆమె మూడు ఫ్లాట్లను జప్తు చేసింది. 2016లో ఠాణె పోలీసులు నమోదు చేసిన రూ.2000 కోట్ల విలువైన మాదకద్రవ్యాల అక్రమ రవాణా కేసులో ఆమె న్యాయస్థానానికి గైర్హాజరవడంతో, ప్రత్యేక ఎన్‌డీపీఎస్‌ న్యాయస్థానం న్యాయమూర్తి హెచ్‌.ఎం.పట్వర్థన్‌ ఈమేరకు ఆదేశించారు. మాదకద్రవ్యాల స్మగ్లరు వికీగోస్వామితో కలసి ప్రస్తుతం కెన్యాలో ఉంటున్న కుల్‌కర్ణిని మనదేశానికి రప్పించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఠాణె పోలీసులు చెబుతున్నారు. వీరిద్దరూ పరారీలో ఉన్నట్లు గతేడాది జూన్‌ 6న ఠాణె న్యాయస్థానం ప్రకటించింది. ఏప్రిల్‌ 2016లో మహారాష్ట్రలోని షోలాపుర్‌ జిల్లాలో గల అవన్‌ లైఫ్‌సైన్సెస్‌ లిమిటెడ్‌ ఆవరణలో నిల్వ ఉంచిన 18.5 టన్నుల బరువు గల ఎఫిడ్రైన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.2000 కోట్లు అని అంచనా.

Related posts

Leave a Comment