సొంత కూతురిపై పోటీ చేయలేను…: రామ్ విలాస్ పాశ్వాన్

సొంత కుమార్తే, తిరుగుబాటు చేస్తూ, మరో పార్టీలో చేరి, తనపై పోటీకి సిద్ధమవుతున్న వేళ, వచ్చే సంవత్సరం జరిగే లోక్ సభ ఎన్నికల నుంచి తప్పుకోవాలని లోక్ జనశక్తి పార్టీ నేత రామ్ విలాస్ పాశ్వాన్ కీలక నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో హాజీపూర్ నుంచి పోటీ చేయాలని ఆయన భావిస్తుండగా, కుమారుడిని ప్రోత్సహిస్తూ, తనను పక్కన పెట్టారని ఆరోపిస్తూ, ఆయన కుమార్తె ఆశ తిరుగుబాటు చేసి ఆర్జేడీకి మద్దతు పలుకుతున్నారు.

హాజీపూర్ నుంచి ఆర్జేడీ తరఫున పోటీ చేస్తానని కూడా ఆమె స్పష్టం చేస్తుండగా, ఒకవేళ ఆర్జేడీ టికెట్ ను ఆశకు ఇస్తే, తాను తప్పుకోవాలన్న ఆలోచనలో పాశ్వాన్ ఉన్నట్టు తెలుస్తోంది. కాగా, 1977లో తొలిసారిగా హాజీపూర్ నుంచి ఎంపీగా ఎన్నికైన పాశ్వాన్, ఆపై ఎనిమిది సార్లు అదే స్థానం నుంచి విజయం సాధించారు.
Tags: ram vilash,paswan,rjd pary, janasakthi

Related posts

Leave a Comment