అది పిట్ట రెట్టా..?

ప్రధాని నరేంద్రమోదీని ఉద్దేశించి కాంగ్రెస్ సోషల్‌మీడియా ఇన్‌చార్జి దివ్య స్పందన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. పిట్ట రెట్టలా ఉంది అని ప్రధానిపై దివ్య చేసిన కామెంట్లపై కమలనాథులు మండిపడుతున్నారు. 182 మీటర్ల పొడవైన భారీ సర్దార్ పటేల్ విగ్రహాన్ని బుధవారం ప్రధాని మోదీ ఆవిష్కరించాక దాని చుట్టూ కలియ తిరిగారు. ఈ సందర్భంగా పటేల్ విగ్రహం పాదాల చెంతన ప్రధాని గల ఫొటోను సోషల్ మీడియాల్లో దివ్య పోస్ట్ చేశారు.

ఇది పిట్టరెట్టలా ఉందంటూ కామెంట్లు పెట్టారు. దీనిపై బీజేపీ భగ్గుమంది. దివ్య స్పందన భాష అహంకారపూరితమని విమర్శించింది. దీనిపై బీజేపీ అధికారప్రతినిధి సంబిత్ పాత్ర మాట్లాడుతూ.. ప్రధానిని విమర్శించేందుకు ఏ ఒక్క అవకాశాన్ని కూడా కాంగ్రెస్ వదులుకోవడం లేదు. దివ్య వాడిన భాష కాంగ్రెస్ నిజ సంస్కృతిని తేటతెల్లం చేస్తున్నది అంటూ ధ్వజమెత్తారు. సామాన్య భారతీయులు కాంగ్రెస్‌కు పిట్ట రెట్టల్లాగే కనిపిస్తున్నారని ఎద్దేవా చేశారు. తన వ్యాఖ్యల్ని దివ్య సమర్థించుకున్నారు. నా వ్యాఖ్యలపై ఎవరికీ సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేదు అని అన్నారు.
Tags: Divya Spandana , Modi , Sardar Vallabhbhai Patel , Social Media

Related posts

Leave a Comment