తెలుగులో మాట్లాడిన షారూక్.. సమావేశంలో నవ్వుల పువ్వులు!

బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ తెలుగులో మాట్లాడే ప్రయత్నం చేసి అందరినీ నవ్వుల్లో ముంచెత్తారు. తన 52వ బర్త్ డే సందర్భంగా నిర్వహించిన ‘జీరో’ సినిమా ప్రమోషన్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. మీడియా అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం చెప్పిన షారూక్.. హైదరాబాద్‌కు చెందిన రిపోర్టర్ ప్రశ్నలు అడిగేందుకు లేచినప్పుడు ఈ సరదా సన్నివేశం జరిగింది. తాను హైదరాబాద్ రిపోర్టర్‌నని చెప్పగానే.. షారూక్ ఉత్సాహంగా ‘నువ్వ హైదరాబాదీవా’ అని ప్రశ్నించాడు. దానికి అవునన్న ఆమె.. ‘బాగున్నారా సర్’ అని ప్రశ్నించింది. దానికి షారూక్.. బాగా తెలుగు వచ్చిన వాడిలా ..‘ఆ, బాగున్నా.. బాగున్నా’ అంటూ తల ఊపడంతో అందరూ ఒక్కసారిగా నవ్వేశారు. ఆ తర్వాత కూడా ‘ఐయామ్ షారూక్ ఖాన్’ను అంటూ తెలుగులో చెప్పడానికి ప్రయత్నించి తాను చెప్పింది కరెక్టేనా అని ప్రశ్నించారు. దీంతో ‘జీరో’ టీమ్‌తో సహా విలేకరులు కూడా పడీపడీ నవ్వారు.

Related posts

Leave a Comment