బీజేపీ ఐదు సీట్లు కూడా గెలవలేదు: కేటీఆర్

బీజేపీ ఐదు సీట్లు కూడా గెలవలేదు: కేటీఆర్

గత ఎన్నికల్లో గెలిచిన ఐదు సీట్లు కూడా ఈసారి బీజేపీ గెలవదని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. నేడు ఆయన రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రైవేట్ లెక్చరర్లు, ముస్లిం మైనారిటీలు నిర్వహించిన ఆత్మీయ సదస్సులలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణలో బీజేపీ 70 సీట్లు గెలుస్తుందని ఆ పార్టీ నేత పరిపూర్ణానంద చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

ఓట్ల కోసం టీఆర్ఎస్ పార్టీ జూటా మాటలను చెప్పదన్నారు. గతంలో పండుగ వేళ హైదరాబాద్‌లో కర్ఫ్యూ ఉండేదని.. ప్రస్తుతం తమ ప్రభుత్వ హయాంలో అలాంటివేమీ లేవన్నారు. ఇకపై విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్‌మెంట్ రెండు విడతలుగా విడుదల చేస్తామని కేటీఆర్ పేర్కొన్నారు. విద్యా ప్రమాణాలు బాగుండాలనే ఉద్దేశంతో తాము కొంత కఠినంగా వ్యవహరించాల్సి వచ్చిందన్నారు.

Related posts

Leave a Comment