ఇక రిజిస్ట్రేషన్ కోసం ఆర్‌టీఏ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పనిలేదు!

వాహనదారులకు ఊరట కల్పించే జీవో ఒకటి విడుదలైంది. వాహనం కొనుగోలు అనంతరం శాశ్వత రిజిస్ట్రేషన్ (పీఆర్), హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ కోసం ఇకపై ఆర్‌టీఏ కార్యాలయాల చుట్టూ తిరగకుండా వాహనం కొన్న షోరూంలోనే రిజిస్ట్రేషన్ చేయించుకునే వెసులుబాటు లభించబోతోంది. తాజాగా విడుదలైన కొత్త జీవో ప్రకారం.. ఇప్పటి వరకు తాత్కాలిక రిజిస్ట్రేషన్ (టీఆర్) స్థానంలో ఒకేసారి శాశ్వత రిజిస్ట్రేషన్ చేసేస్తారు. ఫలితంగా ఒకేసారి పీఆర్, హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్‌తో రోడ్డుమీదికి వచ్చేయొచ్చన్నమాట.

ఏపీలో విజయవంతంగా నడుస్తున్న ఈ విధానాన్ని త్వరలోనే తెలంగాణలోనూ అమల్లోకి తెచ్చేందుకు రవాణాశాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. తొలుత హైదరాబాద్‌లో ప్రయోగాత్మకంగా అమలు చేసిన అనంతరం రాష్ట్రవ్యాప్తంగా దీనిని విస్తరించనున్నారు. ఇందుకోసం ఏపీ అనుభవాలను పరిగణనలోకి తీసుకుంటామని రవాణాశాఖ కమిషనర్ రమేశ్ తెలిపారు. ఈ విధానం కనుక అమల్లోకి వస్తే సమయం, సొమ్ము కూడా ఆదా అవుతాయి.
Tags: RTA offices in hyd, moter cycles

Related posts

Leave a Comment