తెలంగాణ గంగా జ‌మునా తెహ‌జీబ్

– ఈ గ‌డ్డ మీద సుఖశాంతులు వెల్లివిరియాలి
– అన్ని మ‌తాల మ‌నుషులూ క‌లిసి జీవించాలి
– ఇమామ్, మౌజంల‌ను గుర్తించిన ఏకైక ప్ర‌భుత్వం టీఆర్ఎస్
– మైనారిటీ విద్యాల‌యాల‌తో ముస్లిం విద్యార్థుల‌కు నాణ్య‌మ‌యిన చ‌దువు
– ఈ దేశంలో వారు అందరితో స‌మానంగా బ‌త‌కాల‌నే మైనార్జీ గురుకులాలు
– షాదీముబార‌క్ తో ఆడ‌బిడ్డ‌ల‌కు ఆస‌రా
– రంజాన్, క్రిస్ మ‌స్, ద‌స‌రాకు చీర‌ల పంపిణీ
– అణ‌గారిన వ‌ర్గాల‌లో ఆత్మ‌న్యూన‌తా భావం ఉండొద్ద‌నే
– ఇమామ్ – మౌజంల ఆత్మీయ స‌మ్మేళ‌నంలో వ‌న‌ప‌ర్తి టీఆర్ఎస్ అభ్య‌ర్థి సింగిరెడ్డి నిరంజ‌న్ రెడ్డి గారు
తెలంగాణ రాష్ట్రం అంటేనే అన్ని మ‌తాల క‌ల‌యిక‌. గంగా జ‌మునా త‌హ‌జీబ్ ల మాదిరిగా క‌లిసి జీవిస్తున్నాం. అన్ని మ‌తాల మ‌నుషులు క‌లిసి జీవించాలి .. ఈ గ‌డ్డ మీద సుఖ‌శాంతులు వెల్లి విరియాలి అని వ‌న‌ప‌ర్తి టీఆర్ఎస్ అభ్య‌ర్థి సింగిరెడ్డి నిరంజ‌న్ రెడ్డి గారు ఆకాంక్షించారు. గురువారం వ‌న‌ప‌ర్తి ప‌ట్ట‌ణంలో నిర్వ‌హించిన ఇమామ్ – మౌజంల ఆత్మీయ స‌మావేశానికి హాజ‌ర‌య్యారు. ఈ సంధ‌ర్భంగా ముస్లిం మైనార్టీల‌కు తెలంగాణ ప్ర‌భుత్వంలో ఇచ్చిన ప్రాధాన్య‌త‌ను ఆయ‌న వివ‌రించారు. దేశంలోనే ఇమామ్ – మౌజంల‌ను గుర్తించి గౌర‌వ వేత‌నం ఇస్తున్న ఏకైక ప్ర‌భుత్వం టీఆర్ఎస్ ప్ర‌భుత్వం అని, మైనారిటీ విద్యాల‌యాలతో ముస్లిం విద్యార్థుల‌కు నాణ్య‌మ‌యిన విద్య అందుతుంద‌ని, కేసీఆర్ లాంటి దూర‌దృష్టి క‌లిగిన నేత ఉండ‌డం మూలంగానే అన్ని వ‌ర్గాల‌కు ప్ర‌భుత్వ అభివృద్ది ప‌థ‌కాల‌లో ప్రాధాన్య‌త ల‌భిస్తుంద‌ని నిరంజ‌న్ రెడ్డి అన్నారు. ఈ దేశంలో ముస్లిం, మైనారిటీలు అన్ని వ‌ర్గాల‌తో స‌మానంగా బ‌త‌కాల‌ని, పోటీ ప‌రీక్ష‌ల‌లో వెన‌క‌బ‌డ‌కూడ‌ద‌ని మైనార్టీ గురుకులాలు ఏర్పాటు చేయ‌డం జ‌రిగింద‌ని, షాదీ ముబార‌క్ ప‌థ‌కంతో పేద ముస్లిం ఆడ‌బిడ్డ‌ల పెళ్లిళ్ల‌కు రూ.
ల‌క్షా 116 అందుతుండ‌డంతో వారికి ఎంతో తోడ్పాటునిస్తుంద‌ని ఆయ‌న అన్నారు. రంజాన్ కు మాత్ర‌మే కాదు క్రిస్ మ‌స్, ద‌స‌రా పండుగ‌ల‌కు చీర‌లు పంచ‌డం వెన‌క ఉన్న ఉద్దేశం స‌మాజంలోని అణ‌గారిన వ‌ర్గాల‌లో ఆత్మ‌న్యూన‌తా భావం ఉండొద్ద‌నే అని నిరంజ‌న్ రెడ్డి అన్నారు. ప్ర‌తి ప్ర‌భుత్వ ప‌థ‌కం వెన‌క స‌మాజంలోని వివిధ వ‌ర్గాల స్థితిగ‌తులు, వారికి ఏ విధంగా చేయూత ఇవ్వ‌గ‌లం అన్న ఉద్దేశం, అందుకు త‌గ్గ అధ్య‌య‌నం ఉంది కాబ‌ట్టే నాలుగున్న‌రేళ్ల కేసీఆర్ పాల‌న‌లో అర‌వై ఏళ్ల‌లో ఎవ‌రూ చేప‌ట్ట‌లేని ప‌థ‌కాలు అమ‌లులోకి వ‌చ్చాయ‌ని, ప్ర‌జ‌ల మ‌న్న‌న‌లు పొందుతున్నాయ‌ని నిరంజ‌న్ రెడ్డి అన్నారు. గ‌త నాలుగున్న‌రేళ్ల పాల‌న‌లో ఎలాంటి గొడ‌వ‌లు, ఇబ్బందులు లేకుండా తెలంగాణ రాష్ట్రం ప్ర‌శాంతంగా ఉంద‌ని ఆయ‌న అన్నారు. రాబోయే ఎన్నిక‌ల్లో కారు గుర్తుకు ఓటేసి టీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. కో ఆప్ష‌న్ మెంబ‌ర్ బాబు మియా, మాజీ ఎక్స్ కౌన్సిలర్ గులాం ఖాద‌ర్, స‌ర్దార్ ఖాన్, పాషా, మైనారిటీ టౌన్ ప్రెసిడెంట్ అజీజ్ ఖాన్, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి జ‌హంగీర్,ఉపాధ్య‌క్షులు పాషా, వ‌న‌ప‌ర్తి ప‌ట్ట‌ణ కార్య‌ద‌ర్శి ఎండీ జోహెబ్ హుస్సేన్, అర్ష‌ద్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Related posts

Leave a Comment