ఏం? తండ్రికి డబ్బులు అప్పివ్వకూడదా?: కేటీఆర్ అసహనం

హైదరాబాద్ సోమాజీగూడ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో టీఆర్ఎస్ నేత కేటీఆర్ కొంత అసహనం ప్రదర్శించారు. విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానాలు చెప్పిన ఆయన.. కేసీఆర్ మీకు ఎందుకు బాకీ పడ్డారన్న ప్రశ్నకు ఒకింత అసహనం ప్రదర్శించారు. తండ్రీ కొడుకులన్నాక మానవ సంబంధాలు ఉండవా? అని ఎదురు ప్రశ్నించారు. ‘‘మీరైతే మీ కుమారుడికి డబ్బులు ఇవ్వరా? మీకు అవసరం అయితే తీసుకోరా?’’ అని ప్రశ్నించారు.

గజ్వేల్ నుంచి నామినేషన్ దాఖలు చేసిన కేసీఆర్ తన ఎన్నికల అఫిడవిట్‌లో కుమారుడు, కోడలికి తాను అప్పు ఉన్నట్టు పేర్కొన్నారు. ఈ విషయంపై ఓ విలేకరి కేటీఆర్‌ను ప్రశ్నిస్తూ.. కేసీఆర్ మీ దగ్గరి నుంచి అప్పు తీసుకున్నారా? ఎందుకు? అని ప్రశ్నించాడు. సమాధానం చెప్పాల్సిన కేటీఆర్ అసహనం ప్రదర్శించారు. కుటుంబంలో అవసరాన్ని బట్టి చేబదులు తీసుకుంటారని, మీరైతే ఇవ్వరా? అని ఆ ప్రశ్న అడిగిన విలేకరితో అన్నారు.

Related posts

Leave a Comment