అదిగో విజయం!

దిల్లీలో ఆఖరి పంచ్‌కు టీమ్‌ ఇండియా సిద్ధమైపోయింది. మూడో టెస్టును గెలవడం దాదాపుగా లాంఛనమే. లంకేయులు అద్భుతం చేస్తే తప్ప.. రికార్డు స్థాయిలో వరుసగా తొమ్మిదో సిరీస్‌ భారత్‌ సొంతమైనట్లే! 410… కోహ్లి, రోహిత్‌, ధావన్‌ ధాటిగా ఆడడంతో భారత్‌.. లంక ముందుంచిన లక్ష్యమిది. కనీసం పోరాటానికే కష్టపడుతున్న ఈ పరిస్థితుల్లో శ్రీలంకకు ఈ కొండంత స్కోరును అందుకోవడం అసంభవమే. కనీసం డ్రా కూడా కష్టమేనని నాలుగో రోజు ఆట చివరికి తేలిపోయింది. తేలాల్సింది గెలుపు అంతరమే! విజయానికి భారత్‌కు కావాల్సింది ఏడు వికెట్లే కాగా.. లంక చేయాల్సింది 379 పరుగులు. జడేజా విజృంభిస్తున్న వేళ.. అస్థిరంగా బౌన్స్‌ అవుతున్న పిచ్‌ లంకేయలను మరింత కఠినంగా పరీక్షంచనుంది. తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక పోరాటం భారత్‌కు సవాల్‌ విసిరేందుకు ఏమాత్రం సరిపోలేదు. జోరు కొనసాగించిన కోహ్లీసేన ఆఖరి టెస్టులో…

Read More