ఆగిపోతే కట్టలేం

పోలవరం స్పిల్‌వే పనుల టెండర్లు ఆపాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి రాసిన లేఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం శాసనసభలో తీవ్రంగా స్పందించారు. పోలవరం పనులు ఎంతో వేగంగా జరుగుతున్న ఈ దశలో కేంద్రం నుంచి వచ్చిన లేఖ లేనిపోని గందరగోళం సృష్టిస్తోందన్నారు. ఈ దశలో ప్రాజెక్టు ఆగిపోతే కట్టడం కష్టమని శాసనసభలో పేర్కొన్నారు. అసెంబ్లీ లాబీల్లోనూ ఇదే విషయమై విలేకరులతో మాట్లాడుతూ ఇంకొంత తీవ్రంగా స్పందించారు. పిలిచిన టెండర్లను కేంద్రం నిలిపేయమంటోందని, ఇలా ఆపమంటే వారికే పనులు అప్పగించి నమస్కారం పెట్టేస్తానని అన్నారు.

పోలవరంపై వాస్తవాలు ప్రజల ముందు పెడతానని చెప్పారు. అంతకుముందు శాసనసభలో ‘రాష్ట్ర విభజన అంశాలు, కేంద్ర ఆర్థిక సాయం’ అనే అంశంపై జరిగిన లఘు చర్చలో చంద్రబాబు ప్రసంగిస్తూ కేంద్ర వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. 60-సి కింద కొన్ని పనులను వేరే కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సిన అవసరముందని, దానికి సంబంధించి అందరితో చర్చించిన తరువాత రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు పిలిచిందన్నారు. అయితే కేంద్రంలోనూ కొంతమంది అధికారులు ఈ ప్రాజెక్టుకు అడ్డంకులు సృష్టిస్తున్నారని చెప్పారు. ఈ టెండర్ల ప్రక్రియను నిలిపేయాలని ఆదేశిస్తూ లేఖ రావడం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే… ‘‘ఎన్నో వ్యయప్రయాసలుపడి పోలవరాన్ని ఈ స్థితికి తీసుకొచ్చాం.

Related posts

Leave a Comment