కమ్యూనిస్టులతోనే జనసేన: సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు

  • పవన్ కల్యాణ్ మాతోనే ఉన్నారు
  • టీడీపీ, వైసీపీలకు ప్రత్నామ్నాయంగా ఉంటాం
  • కరవుపై స్పందించకపోతే పోరాటం తప్పదు

కరవు కారణంగా ఇబ్బంది పడుతున్న రైతులను ఆదుకోవాలంటూ అనంతపురంలో వామపక్షాలు, జనసేన కలిసి భారీ కవాతును నిర్వహించాయి. నగరంలోని ప్రధాన కూడళ్లలో ఎరుపు జెండాలు పట్టుకుని భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం రఘువీరా టవర్స్ వద్ద సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు రామకృష్ణ, మధు మాట్లాడారు.

ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ, వైకాపాలు మాత్రమే ఉన్నాయనుకుంటే పొరపాటని, ఆ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయంగా తాము, జనసేన కలిసి ఉంటామని స్పష్టంచేశారు. కమ్యూనిస్టులతోపాటు పవణ్ కల్యాణ్ ఉంటారని అన్నారు. ఓ వైపు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అబద్ధాలతో కాలం గడుపుతుంటే.. మరోవైపు ప్రధాని మోదీ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. కరవుపై సీఎం ఇప్పటికైనా స్పందించకపోతే పోరాటం తప్పదని రామకృష్ణ హెచ్చరించారు.
Tags: janasena party,tdp ysrcp party,cpm madhu

Related posts

Leave a Comment