కొణిదెల – ఉయ్యాలవాడ వార్ – అంత డిమాండ్ చేశారా..?

గత రెండు రోజులు నుండి సైరా సినిమా గురించి ఒక వివాదం నడుస్తుంది. ఈ సినిమా తీయటానికి ఆ చిత్ర యూనిట్ ఉయ్యాలవాడ ఫ్యామిలీతో ఒక అగ్రిమెంట్ చేసుకుందని, దాని ప్రకారం డబ్బు చెల్లించటానికి జూన్ 30న కొణిదెల ఆఫీస్ కి రమ్మని గతంలో చెప్పారు. అయితే తాజాగా కొణిదెల ఆఫీస్ మేనేజర్ ఫోన్ చేసి అగ్రిమెంట్ ఏమి చెల్లదు, మీకు ఎలాంటి డబ్బులు ఇచ్చేది లేదు. మీకు, కథకి అసలు సంబంధం లేదంటూ చెప్పాడని, తమకి తగిన న్యాయం చేయాలనీ కొణిదెల కుటుంబ సభ్యులు ధర్నాకి దిగటం జరిగింది.

అయితే ఇక్కడ అసలు విషయం గమనిస్తే ముందు కొణిదెల ప్రొడక్షన్- ఉయ్యాలవాడ ఫ్యామిలీ చేసుకున్న అగ్రిమెంట్ లో కేవలం కొన్ని లక్షల అమౌంట్ మాత్రమే ఇస్తామని చెప్పినట్లు ఉందని, కానీ ఇప్పుడు ఉయ్యాలవాడ ఫ్యామిలీ దాదాపు 8 కోట్లు అడిగినట్లు తెలుస్తుంది. అంత అమౌంట్ ఇచ్చేది లేదని కొణిదెల ప్రొడక్షన్ హౌస్ తేల్చి చెప్పటంతో గొడవ మొదలైంది. దీనిపై ఉయ్యాలవాడ సభ్యులు మాట్లాడుతూ, సినిమా కోసం మా గృహాలను, మా పంట పొలాలను వాడుకున్నారు. షూటింగ్ వలన మా పంట చాలా నష్టపోయింది. కాబట్టి దానికి తగ్గ పరిహారం అడుగుతున్నాం, అలాగే మావి దాదాపు ఏడు కుటుంబాలు ఉన్నాయి, అందరికి న్యాయం చేయాలనీ కోరుతున్నామంటూ చెప్పుతున్నారు.

సరే వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన స్టోరీ తీసుకున్నారు కాబట్టి, దానికి తగ్గట్లు కొంచం అమౌంట్ అనేది ఇస్తారు. దాని విలువ లక్షల్లోనే ఉంటుంది. లేదా ఒకటి అంతకంటే ఎక్కువ రెండు కోట్లు డిమాండ్ చేయవచ్చు కానీ, ఏకంగా 8 కోట్లు అంటే అది అత్యాశే అవుతుంది. ఒక్కసారి అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత దానికే కట్టుబడాలి. సరే వాళ్ళ పంట పొలాల్లో పంట నష్టపోయారని చెపుతున్నారు కాబట్టి, దానికి ఒక రేట్ అంటూ ఉంటుంది. దానికి తగ్గట్లు అడిగితే ఇవ్వటానికి ఎవరు వెనకాడరు, కానీ ఇలా కోట్లకి కోట్లు అడుగుతుంటే ఎలా ఇస్తారు..? సరే జరిగింది ఎదో జరిగింది, వాళ్ళకి చెప్పిన అమౌంట్, వాళ్ళు ఇప్పుడు అడుగుతున్న అమౌంట్ వ్యత్యసం చూసుకొని ఇద్దరికీ సరిపోయేటట్లు ఒక అమౌంట్ ఫిక్స్ చేసుకొని చెల్లిస్తే ఈ వివాదం ఆగిపోతుంది. అసలే సినిమాకి క్రేజ్ పెరిగే టైములో ఇలాంటి పంచాయితీలు అవసరమా..?
Tags: konedala production, sye raa movie contorvercy, agreement, uyyalavada family

Related posts

Leave a Comment