పాన్‌లో తండ్రి పేరు తప్పనిసరి కాదు

fathers name not mandatory in PAN card

పర్మినెంట్ ఎకౌంట్ నంబర్ (పాన్‌) దరఖాస్తులో ఇకపై తండ్రి పేరును తప్పనిసరిగా తెలియజేయాల్సిన నిబంధనను సడలించినట్టు కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి (సీబీడీటీ – సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్) తెలియజేసింది. తల్లి మాత్రమే ఉన్నవారికి ఈ సడలింపు వర్తిస్తుందని స్పష్టం చేసింది. తాజా ఆదేశాల మేరకు మరణించిన లేదా తల్లిని వదిలి దూరంగా ఉన్న తండ్రి పేరును దరఖాస్తులో తెలియపరచాల్సిన అవసరం ఉంటదు. ఈ మేరకు సీబీడీటీ ఓ నోటిఫికేషన్‌ ను విడుదల చేసింది. డిసెంబర్ 5 నుంచి తాజా మార్పులు అమలులోకి వస్తాయని తెలిపింది. కాగా, ఒక ఫైనాన్షియల్ ఇయర్ లో రూ. 2.5 లక్షలకు మించి లావాదేవీలు జరిపే ప్రతి సంస్థా తప్పనిసరిగా పాన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవాలని గతంలోనే సీబీడీటీ ఆదేశించిన సంగతి తెలిసిందే.
Tags: fathers name, Parmanents account, CBDT

Related posts

Leave a Comment