యువతిని ప్రేమించి మోసం… టీ-టీడీపీ నేత కుమారుడి అరెస్ట్

ttdp saama bhupal reddy son, saama tej, cheating, interior designer

ఇంటీరియర్ డిజైనర్ సింధూరితో ప్రేమాయణం
పెళ్లి చేసుకుందామంటే దాటవేత
మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవడంతో అరెస్ట్
ఓ యువతిని ప్రేమించి, ఆపై పెళ్లి చేసుకోకుండా, మరో యువతిని వివాహమాడిన తెలంగాణ టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సామ భూపాల్‌ రెడ్డి కుమారుడు సామ తేజ్‌ పాల్‌ రెడ్డి (27)ని పోలీసులు అరెస్ట్‌ చేశారు. మరిన్ని వివరాల్లోకి వెళితే, హైదరాబాద్ కు చెందిన ఇంటీరియర్ డిజైనర్ సాయి సింధూరి (27)ని సామ తేజ్ పాల్ రెడ్డి ప్రేమించాడు. పెళ్లి చేసుకుందామని మాయమాటలు చెప్పాడు.

అయితే, ఎప్పుడు పెళ్లి చేసుకుందామని అడిగితే, రేపు, మాపు అంటూ కాలం గడిపాడు. ఈ విషయమై గత డిసెంబర్ లోనే సింధూరి శంకర్ పల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసును పోలీసులు విచారిస్తుండగానే, ఇటీవల తేజ్ పాల్ రెడ్డి మరో అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. దీంతో అతన్ని అరెస్ట్ చేసి, రిమాండ్ కు తరలించామని పోలీసులు తెలిపారు. తేజ్ పాల్ పై ఐపీసీ సెక్షన్‌ 376, 417, 420 కింద కేసు పెట్టినట్టు వెల్లడించారు.
Tags:ttdp saama bhupal reddy son, saama tej, cheating, interior designer

Related posts

Leave a Comment