రెండున్నర గంటలలోనే ముగిసిపోయే ‘2.0’!

ప్రపంచ వ్యాప్తంగా రజనీకాంత్ అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న రోజు రావడానికి ఇంకెంతో సమయం లేదు. మరో ఎనిమిది రోజుల్లో ఆయన కొత్త చిత్రం ‘2.ఓ’ థియేటర్లోకి రానుంది. రజనీకాంత్ తో పాటు అక్షయ్‌ కుమార్, అమీజాక్సన్‌ తదితరులు నటించగా, శంకర్‌ దర్శకత్వంలో సుమారు రూ. 550 కోట్ల బడ్జెట్‌ తో ఇది తయారైంది.

ఇక ఈ చిత్రం సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయని కోలీవుడ్‌ వర్గాల సమాచారం. ఈ సినిమా నిడివి రెండున్నర గంటలు కూడా లేదట. ఇంకా కచ్చితంగా చెప్పాలంటే, 2.28.52 సెకన్ల చిత్రమిది. సినిమాకు ఎటువంటి కట్స్ చెప్పని సెన్సార్ బోర్డు, కొన్ని పదాలను మాత్రం పైకి వినిపించకుండా చేయాలని సూచించిందని తెలుస్తోంది. గతంలో శంకర్‌ దర్శకత్వంలో వచ్చిన ‘జెంటిల్‌ మన్’, ‘భారతీయుడు’, ‘అపరిచితుడు’, ‘రోబో’లతో పోలిస్తే, ‘2.ఓ’ నిడివి తక్కువ కావడం గమనార్హం.
Tags:rajni kanth, robo 2.0 movie, shankar direction, movie release date
2.0 movie tamil and telugu review and rating

Related posts

Leave a Comment