వివాహేతర సంబంధాల్లో శిక్ష పురుషులకేనా? సెక్షన్ 497 ను సవాల్ చేస్తూ పిల్!

వివాహేతర సంబంధాల్లో మహిళలను శిక్షించగా విడిచిపెడుతున్నారు
ఐపీసీ 497 సెక్షన్ ను కొట్టివేయాలి
విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు ధర్మాసనం
వివాహేతర సంబంధాలకు సంబంధించి ఐపీసీ సెక్షన్ 497ను సవాల్ చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)ను సుప్రీం కోర్టు విచారణకు స్వీకరించింది. భారత సంతతి వ్యక్తి జోసఫ్ షినే (40) ఈ పిల్ దాఖలు చేశారు. ఆయన వాదన ఏంటంటే.. ఐపీసీ 497 సెక్షన్ ప్రకారం ఏ వివాహిత వ్యక్తి అయినా మరో వివాహిత మహిళతో, ఆమె భర్త అనుమతి లేకుండా సంబంధం పెట్టుకుంటే అది వ్యభిచారంగా పరిగణిస్తారు. ఈ వ్యవహారంలో పురుషునికి శిక్ష విధిస్తారు. మహిళకు ఎలాంటి శిక్షా ఉండదు. ఈ సెక్షన్ ప్రకారం కేవలం పురుషులనే శిక్షించి, మహిళలను విడిచిపెట్టడం తగదని, రాజ్యాంగ విరుద్ధంగా ఉన్న ఈ సెక్షన్ ని కొట్టివేయాలని జోసఫ్ షినే కోరారు. ఈ వ్యాజ్యాన్ని నిన్న విచారణకు స్వీకరించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్ర, న్యాయమూర్తులు జస్టిస్ ఎఎం ఖన్విల్కర్, జస్టిస్ డివై చంద్రచూడ్ లతో కూడి ధర్మాసనం విచారణ జరపనుంది. ఈ వ్యవహారంపై నాలుగు వారాల్లో సమాధానం చెప్పాలని కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.

Related posts

Leave a Comment