శరవేగంగా సభ్యత్వాలు

టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం శరవేగంగా కొనసాగుతున్నది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, నియోజకవర్గ ఇంచార్జీలు, జెడ్పీ చైర్‌పర్సన్లు తదితరులు సభ్యత్వ నమోదులో పాల్గొంటుండగా, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా ఈ ప్రక్రియను ముందుకు తీసుకెళ్తున్నారు. టీఆర్‌ఎస్ అభిమానులు, ప్ర జలు స్వచ్ఛందంగా వచ్చి సభ్యత్వాలను స్వీకరిస్తున్నారు. హైదరాబాద్‌లోని పాత మలక్‌పేట డివిజన్‌లో ఆదివా రం నిర్వహించిన టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో హోం మంత్రి మహమూద్ అలీ పాల్గొని పలువురికి సభ్యత్వాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదుకు పాత బస్తీలో విశేష స్పందన లభిస్తుందన్నారు. ముఖ్యంగా ముస్లింలు ఉత్సాహంగా ముందుకువస్తున్నారని తెలిపారు.

కార్యక్రమంలో బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ దేవీప్రసాద్, టీఆర్‌ఎస్ గ్రేటర్ అడ్‌హక్ కమిటీ సభ్యుడు బుగుడాల సుదర్శన్ పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని బాగులవాడ, బుధవార్‌పేట్, ఈద్‌గాం కాలనీల్లో టీఆర్‌ఎస్ సభ్య త్వ నమోదులో దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ.. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ముమ్మరం గా చేపట్టాలని నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మేడ్చల్ జిల్లా శామీర్‌పేట మండ లం దేవరయాంజాల్, అలియాబాద్, బొమ్మరాశిపేట, తూంకుంట, జవహర్‌నగర్, గుండ్లపోచంపల్లి, మేడ్చల్‌లో నిర్వహించిన సభ్యత్వ నమోదులో కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి మాట్లాడుతూ.. సభ్యత్వ నమోదు ను ఉద్యమంలా చేపట్టాలని పిలుపునిచ్చారు.

Related posts

Leave a Comment