ఇప్పటికి పేరు చెప్పలేను… ఆ హీరోను మాత్రం వదిలిపెట్టను

amyra daster, #MeeToo bolly,carvan,south indian movies

దక్షిణాదిన ఓ ప్రముఖ హీరో అల్లుడు, యువ హీరో తనను వేధించాడని సంచలన ఆరోపణలు చేసిన నటి అమైరా దస్తర్, తాజాగా ఓ పత్రికకను ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను ఎదుర్కొన్న వేధింపుల గురించి మరిన్ని వివరాలు చెప్పుకొచ్చింది. ఆ సినిమా షూటింగ్ సమయంలో హీరోతో సాంగ్ చేస్తుండగా, అనవసరంగా తనపై చెయ్యి వేసి ఇబ్బంది పెట్టాడని, ఆ విషయాన్ని దర్శకుడి దృష్టికి తీసుకెళితే, తనకు నరకం చూపించారని ఆరోపించింది.

ఉదయం ఎనిమిది గంటలకే షూటింగ్ కు పిలిచేవారని, తాను సిద్ధమై కార్వన్‌ లో కూర్చుంటే ఎప్పటికీ పిలిచేవారు కాదని చెప్పింది. ఉదయం నుంచి కూర్చోబెట్టి సాయంత్రం ఓ ఐదు నిమిషాలు షూటింగ్‌ చేసి పేకప్ చెప్పేవారని, షూటింగ్ లేకుంటే తనకు విషయం చెప్పేవారు కాదని వెల్లడించింది. ఈ అనుభవంతో దక్షిణాది సినిమాలు చేయాలంటేనే భయం పట్టుకుందని చెప్పింది. అయితే, ఈ విషయాలేవీ తన తల్లిదండ్రులకు చెప్పలేదని, ఆ హీరోకు దక్షిణాది సినీ పరిశ్రమలో మంచి పలుకుబడి ఉందని, ఓ పెద్ద హీరోకి అల్లుడని చెప్పింది. అతని పేరును ఇప్పుడు తాను చెప్పలేనని, చెబితే తన కెరీర్‌ ని నాశనం చేస్తారని వాపోయింది. అయితే, ఏదో ఒకరోజు అతగాడి పేరు చెబుతానని, ఆ హీరోని మాత్రం వదలేది లేదని అంది. కాగా, అమైరా దస్తర్, గతంలో ధనుష్ తో కలసి ‘అనేగన్’ అనే సినిమాలో (తెలుగులో అనేకుడు) నటించింది. ఆమె, చెబుతున్న వివరాలను బట్టి ధనుష్ పైనే ఆరోపణలు చేస్తోందని సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఆ సినిమా సమయంలోనే వేధింపులను ఎదుర్కొని ఉంటుందని పలువురు అంటున్నారు. హీరో ధనుష్, రజనీకాంత్ అల్లుడన్న సంగతి తెలిసిందే. ఇక తనను వేధించింది ఎవరన్న విషయాన్ని అమైరా స్వయంగా చెబితే తప్ప నిజం బయటకు రాదు.
Tags: amyra daster, #MeeToo bolly,carvan,south indian movies

Related posts

Leave a Comment